వికారి నామ ఉగాది పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామునుంచే భక్తులు ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉండ్రాజవరంలో కొలువైన ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం భక్తజనంతో రద్దీగా మారింది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మెుక్కులు తీర్చుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక పూజలు చేశారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని పశ్చిమగోదావరి జిల్లాలోని ఆలయాలు భక్తులతో రద్దీగా మారాయి. అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు