ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సరిహద్దు రాళ్లు పాతినా.. సమస్య పరిష్కారం కాలేదు'

రియల్ వ్యాపారుల ఆగడాలకు బలి అవుతున్నామని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అధికారులను ఓ వ్యక్తి ఆశ్రయించాడు. తన స్ధలాన్ని మార్గంగా చూపిస్తూ.. కొందరు సొమ్ము చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశాడు.

west godavari district
లే-అవుట్ పక్కన ఉన్న స్ధలం

By

Published : Feb 11, 2020, 11:18 PM IST

లే-అవుట్ పక్కన ఉన్న స్ధలం

పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో 4 ఏకరాల రియల్ లే-అవుట్ పక్కన ఉన్న భూమి తనదే అంటూ.. అప్పారావు అనే వ్యక్తి అధికారులను ఆశ్రయించారు. కొనుగోలుదారులకు తమ స్ధలాన్ని.. మార్గంగా చూపిస్తూ కొందరు రియల్ వ్యాపారం చేసుకుంటున్నారని ఫిర్యాదు చేశారు. అధికారులే వచ్చి సమస్య పరిష్కారించాలని స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు.

అధికారులు స్పందించి దారి మార్గం అప్పారావుదే అని గుర్తించి సరిహద్దు రాళ్లు పాతి వేళ్లారు. అయినా... తన సమస్య పరిష్కారం కాలేదని మళ్లి అధికారలని ఆశ్రయించారు అప్పారావు. రియల్ ఎస్టేట్ దందాలను అరికట్టి తన స్ధలాన్ని అప్పగించాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details