గుంటూరులోని పొలాస నుంచి కాకినాడకు తరలిస్తున్న 28 టన్నుల రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అక్రమంగా బియ్యం తరలింపుపై సమాచారం అందుకున్న అధికారులు పశ్చిమ గోదావరి జిల్లాలోని దెందులూరు వద్ద తనిఖీలు చేపట్టారు. బియ్యాన్ని తరలిస్తున్న లారీని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనిఖీల్లో విజిలెన్స్ సీఐ విల్సన్, తసీల్దార్ రవికుమార్, ఆర్ఐ సునీత, వీఆర్వో శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఇరవై ఎనిమిది టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీన పరచుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు వద్ద తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు.
రేషన్ బియ్యం పట్టివేత