కరోనా రోగులకు అందే చికిత్సపై పర్యవేక్షణ పెరగాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రభుత్వాన్ని కోరారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. మహమ్మారి బారిన పడకుండా వైద్యులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో చాలాచోట్ల వైద్యులకు కనీసం గ్లౌజులు కూడా లేవని అన్నారు. ఆస్పత్రుల్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదన్నారు.
అలాగే కరోనా వ్యాప్తికి మద్యం దుకాణాలు కారణం కావచ్చని ఎంపీ రఘరామకృష్ణరాజు అభిప్రాయపడ్డారు.