నాగబాబు ఓడిపోతే మళ్లీ జబర్ధస్త్ చేసుకుంటారే తప్ప... ప్రజల్లో ఉండరని సినీనటుడు పృథ్వీ ఎద్దేవా చేశారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... పవన్ కేవలం ప్రతిపక్ష నాయకులనే ప్రశ్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. జగన్ వస్తే రాష్ట్రం మరో బిహార్ అవుతుందంటూ పవన్ చేసిన విమర్శలను ఖండించారు. విద్వేషాలు రెచ్చగొట్టె విధంగా పవన్ రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించారు.
జగన్పై పవన్ విమర్శలకు.. పృథ్వీ కౌంటర్ - సినీనటుడు
జగన్ వస్తే రాష్ట్రం మరో బిహార్ అవుతుందంటూ పవన్ చేసిన విమర్శలను వైకాపా నాయకుడు, సినీనటుడు పృథ్వీ ఖండించారు. విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయాలు చేయాలని పవన్ చూస్తున్నారంటూ ఆయన ఆరోపించారు.
సినీనటుడు పృథ్వీ ప్రచారం