ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువు పట్టివేత... - కామయ్యపాలెం తనిఖీ కేంద్రం

అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువులను తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు పట్టుకుని వ్యవసాయ అధికారులకు అప్పగించారు. రైతుల పేరిట ఎరువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామని వ్యవసాయ అధికారి పార్వతి తెలిపారు .

Police seized  smuggled  fertilizers
అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువు పట్టివేత

By

Published : Nov 3, 2020, 1:04 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం కామయ్యపాలెం తనిఖీ కేంద్రం వద్ద అక్రమంగా తరలిస్తున్న 79 బస్తాల ఎరువులను పోలీసులు పట్టుకున్నారు. అనంతరం ఆ బస్తాలను వ్యవసాయ అధికారులకు అప్పగించారు. వీటిని జంగారెడ్డిగూడెం నుంచి తెలంగాణ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎరువులను కామయ్యపాలెం డీసీఎంఎస్ దుకాణంలో భద్ర పరిచామని మండల వ్యవసాయ అధికారి పార్వతి తెలిపారు. ఎరువుల తరలింపులో ఈపాస్ బిల్లులు తప్పనిసరిగా ఉండాలని ఏవో చెప్పారు. రైతుల పేరిట ఎరువులను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు.

ABOUT THE AUTHOR

...view details