ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలవరానికి ఇక నేరుగా నిధులు!

పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి వచ్చిన నిధులు దానికి మాత్రమే ఖర్చు చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు నేరుగా నిధులు వచ్చేలా ఒక ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసి పోలవరం అథారిటీ నుంచి ఆ నిధులు నేరుగా ఆ ఖాతాకు జమ అయ్యేలా చూస్తారు

polavaram funds directly to project
పోలవరానికి ఇక నేరుగా నిధులు!

By

Published : Apr 17, 2020, 6:36 AM IST

కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఇక నేరుగా పోలవరం ప్రాజెక్టు పనుల కోసం మాత్రమే ఖర్చు చేసేందుకు వీలుగా రాష్ట్ర జలవనరుల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. రాష్ట్ర ఖజానాకు చేరిన తర్వాత ఆర్థిక శాఖ అనుమతితోనే పెండింగు బిల్లులకు నిధులు అందుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఫిబ్రవరి నెలాఖరున రూ.1800 కోట్లు విడుదల చేయగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ తన నిర్వహణ ఖర్చులు మినహాయించుకుని మిగిలిన నిధులు రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. ఆ నిధులు వచ్చినా ఆర్థికశాఖ ఇతరత్రా అవసరాల నిమిత్తం ఆ నిధులు మళ్లించింది. పోలవరంలో ఇప్పటికీ దాదాపు రూ.320 కోట్ల వరకు బిల్లులు పెండింగులో ఉన్నాయి. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుకు నేరుగా నిధులు వచ్చేలా ఒక ప్రత్యేక ఖాతా ఏర్పాటు చేసి పోలవరం అథారిటీ నుంచి ఆ నిధులు నేరుగా ఆ ఖాతాకు జమ అయ్యేలా చూస్తారు. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనుమతితోనే ఆ నిధులు వెచ్చించుకునే అవకాశం ఉంటుంది. ఇందుకోసం పోలవరం అథారిటీలో ప్రత్యేకంగా ఆమోదం తీసుకుని పంపాల్సి ఉంటుందని కేంద్రం తెలియజేసింది. ఇందుకోసం పోలవరం అథారిటీ అధికారులను సంప్రదించగా ఏప్రిల్‌ 21న ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసేందుకు అంగీకరించినట్లు సమాచారం.

ABOUT THE AUTHOR

...view details