ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆధార్ కేంద్రాల వద్ద జనం బారులు...ప్రభుత్వ పథకాల కోసం తిప్పలు

పుట్టిన దగ్గర నుంచి ప్రతి మనిషికి ఆధార్ కార్డు అత్యంత అవసరం. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకానికి ఆధార్​కి ఫోన్ నంబర్ లింక్ చేస్తేనే పథకం వర్తిస్తుందని నిబంధన విధించారు. దీంతో ప్రజలు ఆధార్ లింక్ కోసం గంటల తరబడి మీసేవ, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. కానీ ఆధార్ లింక్ కాకపోవటంతో పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.

ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న ప్రజలు
ఆధార్ కేంద్రాల వద్ద బారులు తీరుతున్న ప్రజలు

By

Published : May 26, 2021, 5:47 PM IST

కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి కొనసాగుతున్న తరుణంలో ప్రభుత్వం ఆధార్​ కార్డుతో ఫోన్ నంబర్ అనుసంధానం చేసుకోవాలని నిబంధన విధించారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ఏ ఆధార్ కేంద్రం వద్ద చూసినా జనాలు బారులు తీరారు. ప్రతి రోజు వందల సంఖ్యలో ఒక్కసారిగా కేంద్రాల వద్దకు వచ్చి అష్టకష్టాలు పడుతున్నారు. నాలుగైదు చోట్ల తిరిగినా సరే..ఎక్కడా ఆధార్ లింక్ కాకపోవటంతో ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోపక్క కరోనా విజృంభిస్తున్నా..ఆధార్ లింక్ కోసం వచ్చిన వారు కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. వైయస్సార్ చేయూత పథకానికి అర్హులమైనప్పటికీ ఆధార్ నమోదు లేకపోవడంతో లబ్ది పొందలేకపోతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి:

జగన్ బెయిల్ రద్దుచేయాలన్న రఘురామ పిటిషన్‌పై.. విచారణ వాయిదా

ABOUT THE AUTHOR

...view details