ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇంటి పన్ను చెల్లించలేదని కుళాయికి డమ్మీ

పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులోని సాయిరాంపేటలో ఒక మహిళ ఇంటి పన్ను చెల్లించలేదు. దీంతో అధికారులు ఆ మహిళ ఇంటి సమీపంలో ఉన్న పబ్లిక్ కుళాయికి డమ్మీ వేసిన కారణంగా... స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. లాక్​డౌన్ సమయంలో ప్రభుత్వాధికారులు ఇలా చేయటం సరికాదని ఆవేదన చెందారు.

officers attach dummy to public using tap for not paying house tax at west godavari
ఇంటి పన్ను చెల్లించలేదని కుళాయికి డమ్మీ వేసిన అధికారులు

By

Published : Apr 19, 2020, 10:46 AM IST

సాధారణంగా ఇంటి పన్ను, కుళాయి పన్ను సకాలంలో చెల్లించకపోతే ఇంటి యజమానిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకుంటారు. ఇక్కడ మాత్రం అధికారులు చేపట్టిన చర్య విమర్శలకు దారితీస్తోంది. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరులోని సాయిరాంపేటలో ఒక మహిళ ఇంటి పన్ను చెల్లించని కారణంగా.. పంచాయతీ అధికారులు ఆమె ఇంటి సమీపంలో ఉన్న పబ్లిక్ కుళాయికి డమ్మీ వేశారు. ఈ కారణంగా.. స్థానికులు తాగునీటికి ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి పన్ను చెల్లించని మహిళపై చర్యలు తీసుకోకుండా ప్రజలందరూ ఉపయోగించుకునే పబ్లిక్ కుళాయికి డమ్మీ వేయడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. లాక్ డౌన్​తో ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రభుత్వాధికారులు ఇలా చేయటం సరికాదని స్థానికులు వాపోతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details