పశ్చిమగోదావరి జిల్లా తణుకులో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజున కనకదుర్గమ్మ మహిషాసురమర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నవ అవతారాల్లో మహిషాసురమర్దినిని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’గా జరుపుకుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శనమిస్తుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుందని భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు అమ్మవారికి సాముహిక కుంకుమ పూజాలు నిర్వహించారు. పలువురు దంపతులు అమ్మవారికి ముత్యాలతో అభిషేకం చేశారు.
నవరాత్రి ఉత్సవాలు.. మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ - పశ్చిమగోదావరి జిల్లా
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో దసరా నరరాత్రిలో భాగంగా గోస్తనీనది తీరాన ఉన్న శ్రీకనకదుర్గ అమ్మవారు మహిషాసురమర్దని అలంకారంలో దర్శనమిస్తున్నారు. . పలువురు దంపతులు అమ్మవారికి ముత్యాలతో అభిషేకం చేశారు.
నవరాత్రి ఉత్సవాలు.. మహిషాసురమర్దినిగా కనకదుర్గమ్మ