ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆచంట జెండా.. చేనేత కార్మికుడి గుండెల నిండా!!

పశ్చిమ గోదావరి జిల్లా ఏ.వేమవరానికి చెందిన చేనేత కార్మికుడు రుద్రాక్షల రామలింగ సత్యనారాయణ.. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు. మగ్గంపై జాతీయ జెండా నేసి ప్రశంసలు అందుకున్నారు. ఎర్రకోటపై ఈ జెండా రెపరెపలాడాలని ఆశపడుతున్నారు

జాతీయ జెండా

By

Published : May 9, 2019, 6:02 AM IST

ఆచంట జెండా.. చేనేత కార్మికుడి గుండెల నిండా!!

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం ఏ. వేమవరానికి చెందిన చేనేత కార్మికులు జాతీయ జెండాను తయారుచేసి దేశభక్తిని చాటారు. తాము నేసిన జాతీయ జెండాను దిల్లీలో ఎర్రకోటపై ఎగరవేయాలనే సంకల్పంతో.. అతుకులు, కుట్లు, రంగులు అద్దకం లేకుండా అశోకచక్రంతో సహా జాతీయ జెండాను మగ్గంపై నేశారు.

ఎర్రకోటపై ఎగరవేసే జెండా కొలతలకు అనుగుణంగా 12 అడుగుల పొడవు, 8అడుగుల వెడల్పు ఉండే విధంగా ప్రత్యేకంగా మగ్గం తయారు చేయించారు. 5నెలలపాటు శ్రమించి మూడు రంగుల పట్టు నూలుతో జెండాతో పాటు అశోక చక్రం గుర్తును నేయటం పూర్తి చేశారు. అశోక చక్రంలో ఉండే 24 ఆకులు నేయటానికి ఒక ఆకుకు 100 చొప్పున మొత్తం 24 ఆకులకు ఇరవై నాలుగు వందల దారాలు వినియోగించారు.

దిల్లీలో ఎర్రకోటపై ఎగురవేయాలని లక్ష్యంతో మరల 8 నుంచి 12 అడుగుల జెండాను తయారుచేశారు. దీన్ని గత నెలలో దేశ ప్రధాని నరేంద్రమోదీకి బహుమతిగా అందించారు. మరో జెండాను నేసేందుకు నూలు సిద్ధం చేశారు.

ఇది కూడా చదవండి.

'లీడ్స్'... స్ఫూర్తిదాయక విజయగాథ!

ABOUT THE AUTHOR

...view details