పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం సత్యనారాయణపురంలో త్రుటిలో పడవ ప్రమాదం తప్పింది. గుండేరు డ్రైన్లో వరద ప్రవాహం ఎక్కువగా ఉండడంతో... స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సూచన మేరకు మత్స్యశాఖ అధికారులు రెస్క్యూ బోటు ఏర్పాటు చేశారు. గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా... ఇంజిన్ మరమ్మతులకు లోనై బోటు కొట్టుకుపోయింది. అందులో ఉన్న వారు చెట్ల కొమ్మలను పట్టుకుని సురక్షితంగా ఒడ్డుకు చేరారు. ప్రాణనష్టం జరగకపోవటంతో అధికారులు, గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.
సత్యనారాయణపురంలో త్రుటిలో తప్పిన పడవ ప్రమాదం - పశ్చిమగోదావరి జిల్లా వాతావరణం
పశ్చిమగోదావరి జిల్లాలో సత్యనారాయణపురంలో పడవ ప్రమాదం తప్పింది. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా ఈ ఘటన జరిగింది. ఎలాంటి ప్రాణ నష్టం లేకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
సత్యనారాయణపురంలో త్రుటిలో తప్పిన పడవ ప్రమాదం