ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన శ్రీరంగనాథరాజు

అత్తిలిలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు పర్యటించారు. ఆటో, కారు డ్రైవర్లు, నాయీ బ్రాహ్మణులకు తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు.

minister sriranganadharaju
నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి శ్రీరంగనాథరాజు

By

Published : May 15, 2020, 8:04 PM IST

లాక్​డౌన్ కారణంగా చేతివృత్తుల వారు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని మంత్రి రంగనాథరాజు పేర్కొన్నారు. తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో కలిసి నిత్యావసర వస్తువులు, కూరగాయలు, కోడిగుడ్లు పంపిణీ చేశారు. పేదవారిని ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్న ఆయన.. ప్రభుత్వం ఎంత సహాయం చేసినా పూర్తిస్థాయిలో చేయలేని పరిస్థితుల్లో దాతలు స్పందించి పేదవారికి సహకారం అందించడం అభినందనీయమన్నారు. కరోనా వైరస్ నివారణ చర్యల్లో శాసనసభ్యులు కారుమూరి వహించిన పాత్ర అభినందనీయమని మంత్రి పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details