పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని బీవీ రాజు కళాశాలలో నిర్వహించిన పంచాయతీ సర్పంచ్ల శిక్షణ కార్యక్రమంలో మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పర్సంటేజ్‌ల కోసం అధికారులు బిల్లులు చేయరని.. బిల్లులు రాకపోవడంతో మీకు డబ్బులు మిగలవని అన్నారు. మీ పంచాయితీలలో మీరు సర్పంచ్‌గా ఉండి పనులు చేయకండని.. మీ పక్క గ్రామాలలో ఉన్న సర్పంచ్ల చేత మీ గ్రామంలో పనులు చేయించుకోండని సూచించారు. అలా అయితే మీ బిల్లుల చెల్లింపులో ఎలాంటి జాప్యం జరగదని చెప్పుకొచ్చారు. గ్రామ సర్పంచ్ అంటే ఒక బ్రాండింగ్ ఉండాలని.. మీ గ్రామంలో మీరు పనులు చేయిస్తే గబ్బు పట్టి పోతారని మంత్రి అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళా రిజర్వేషన్లో గెలిచిన వారు సర్పంచ్ కుర్చీలో ఎవరిని కూర్చొనివద్దని.. అది భర్త అయిన సరే కూర్చొనీయకండని సూచించారు.
ఇదీ చదవండి: