పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన వలస కూలీలును తరలించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు నరసాపురం సబ్ కలెక్టర్ కేఎస్ విశ్వనాథన్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వరాష్ట్రానికి కూలీలును తరలించేందుకు ప్రత్యేక శ్రామిక్ రైలును సబ్ కలెక్టర్ కే.ఎస్. విశ్వనాథన్ జెండా ఊపి ప్రారంభించారు.
బుధవారం నరసాపురం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్న 1589 మంది వలస కూలీలను ఆర్టీసీ బస్సుల్లో నరసాపురం విజేత ఇంజినీరింగ్ కళాశాలకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించి మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. అనంతరం రైల్వే స్టేషన్‌కు తరలించి శ్రామిక్ రైళ్లు ఎక్కించారు.