పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నవుడూరు గ్రామానికి చెందిన మేడపాటి మురళి జల్సాలకు అలవాటు పడ్డాడు. ఈ క్రమంలో కార్లు యజమానుల వద్ద అద్దెకు తీసుకుని మాయమాటలతో ఇతరులకు విక్రయించడం మొదలుపెట్టాడు.
నరసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 11 కార్లను విక్రయించాడు. జిల్లాకు చెందిన ఒక కారు యజమాని ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.