ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

"పోలవరం ప్రాజెక్టుకు వాజ్​పేయీ పేరు పెట్టాలి" - భాజపా రాష్ట్ర అధ్యక్షులు

మాజీ ప్రధాని, దేశభక్తుడైన అటల్ బిహారి వాజ్ పేయి పేరును పోలవరం ప్రాజెక్టుకు పెట్టాలని, భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ అభిప్రాయంపడ్డారు. ఈ మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి లేఖ వ్రాశారు.

పోలవరం ప్రాజెక్టుకు వాజ్ పేయి పేరు పెట్టాలి

By

Published : Feb 19, 2019, 8:07 PM IST

Updated : Feb 19, 2019, 10:24 PM IST

ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టుకు మాజీ ప్రధాని వాజపేయి పేరు పెట్టాలని భాజపా రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ ప్రతిపాదించారు. ఈ మేరకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. కేంద్రం సహకారంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకు మాజీ ప్రధాని, దేశభక్తుడైన అటల్ బిహారి వాజ్ పేయి పేరు పెట్టడం అన్ని విధాల సబబని ఆయన అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు గడ్కరీ చొరవతోనే పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్టుగా పోలవరాన్నిఅభివర్ణించారు.గుంటూరు జిల్లా కొండవీడు ఉత్సవాల్లో పోలీసుల దెబ్బల వల్లే, రైతు మరణించారని కన్నా ఆరోపించారు. కోటయ్య మృతిపై విచారణ జరిపించాలంటూ, కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు మరో లేఖ రాశారు.

పోలవరం ప్రాజెక్టుకు వాజ్ పేయి పేరు పెట్టాలి
Last Updated : Feb 19, 2019, 10:24 PM IST

ABOUT THE AUTHOR

...view details