పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం చెక్పోస్ట్ వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకొన్నారు. తెలంగాణ నుంచి తూర్పుగోదావరి జిల్లాకు ఐషర్ వాహనంలో బియ్యాన్ని తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసు అధికారి తెలిపారు. తొమ్మిది టన్నుల బియ్యంతోపాటు, ఐషర్ వాహనాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఈ బియ్యాన్ని రైస్ మిల్లులో పాలిష్ పట్టి సన్న బియ్యంగా మార్చి విక్రయిస్తారని పోలీసులు పేర్కొన్నారు.
జంగారెడ్డిగూడెంలో రేషన్ బియ్యం పట్టివేత.. వాహనం సీజ్ - jangareddygudem crime news
పేదల కడుపు నింపాల్సిన రేషన్ బియ్యం అక్రమార్కుల జేబులు నింపుతోంది. కొంతమంది అడ్డదారుల్లో ప్రజా బియ్యాన్ని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న తొమ్మిది టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు.
జంగారెడ్డిగూడెంలో రేషన్ బియ్యం పట్టివేత