ప్రజాసమస్యల పరిష్కారమే లక్ష్యంగా వాలంటీర్, సచివాలయ వ్యవస్థల ఏర్పాటు ఉద్దేశ్యమని రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా జుత్తిగ, మల్లిపూడి, భట్లమగుటూరు గ్రామాల్లో సుమారు మూడు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజులతో కలిసి ప్రారంభించారు. రాష్ట్రంలో లక్ష కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి సుచరిత వెల్లడించారు. పేద, బలహీనవర్గాల ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు మొదటి దశలో 25 లక్షల ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని గుర్తు చేశారు. విద్యా రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి 25 వేల కోట్ల రూపాయలతో నాడు - నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ధి చేశామని చెప్పారు. మహిళా రక్షణకు దిశ యాప్ ను అమల్లోకి తెచ్చి.. మహిళల ఆత్మ రక్షణకు భరోసా కల్పించామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని తెలిపారు.
home minister sucharitha:'అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా సీఎం జగన్ పాలన'
పశ్చిమగోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లో హోంమంత్రి మేకతోటి సుచరిత పర్యటించారు. మంత్రులు తానేటి వనిత, శ్రీరంగనాథరాజులతో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ పని చేస్తున్నారని కొనియాడారు.
home minister sucharitha