గ్యాస్ సిలిండర్ పేలి దుకాణం దగ్ధమైన ఘటన పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన భవనం కింది అంతస్తులో కిరాణా దుకాణం నిర్వహిస్తున్న నాగబాబు.. పై అంతస్తులో కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గురువారం సాయంత్రం ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో 14లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. దుకాణంలో బాణాసంచా ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించి భారీ నష్టం వాటిల్లింది. దుకాణం నుంచి భారీగా పొగ రావటంతో గణపవరం-భీమవరం రహదారిపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణసష్టం జరగకపోవడం వల్ల అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గ్యాస్ సిలిండర్ పేలి దుకాణం దగ్ధం
గ్యాస్ సిలిండర్ ప్రమాదాలు వినియోగదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కనీస జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ప్రమాదాలు తీవ్రతరం అవుతున్నాయి. తాజాగా పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో జరిగిన ఘటన ఇలాంటిదే. గ్యాస్ సిలిండర్ పేలి భారీ ఆస్తి నష్టం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
గణపవరంలో గ్యాస్ సిలిండర్ పేలి దుకాణం దగ్ధం