పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో ఖరీఫ్ పనులు పూర్తికాక.. రబీ సాగుకు సన్నాహాలు చేయలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తుపానులు, అధిక వర్షాల ప్రభావంతో మండల పరిధిలో పలు ప్రాంతాల్లో నూర్పిడి పనులు నిదానంగా సాగుతున్నాయి. నివర్ తుపాను ప్రభావంతో పంటలు తడిసిపోవటం, నూర్పిడి పనులు ఆగిపోయాయి. ఖరీఫ్ పనులు పూర్తికాక.. రబీకి నారు మరడులు పోసే పనులు ఆలస్యమవుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు.
కొన్ని చోట్ల పొలాల్లో ఉన్న ధాన్యాన్ని బయటకు తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు తప్పటం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.