పంట నష్టానికి ప్రభుత్వ సాయమందించే సమయంలో... సిబ్బంది నిర్లక్ష్యంతో పరిహారం అందలేదని రైతన్నలు వాపోతున్నారు. తమ పంటలకు గత మూడు ఏళ్ల నుంచి పంట నష్ట పరిహారం రాలేదని వాపోతున్నారు. పంట నష్టపోయిన తమకు కాకుండా.. వేరే వారి ఖాతాల్లో నగదు పడటం ఏంటని ఆందోళన చెందుతున్నారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని పెద్ద పంచాయతీలో చిట్టవరంలో జరిగింది.
నష్టం ఒకరిది... పరిహారం మరొకరికి - Farmers' concern in Narsapuram, West Godavari district
ఆరుగాలం శ్రమించి అన్నం పెట్టే రైతన్నకు అడుగడుగునా విపత్తులే.... పంట బాగా పండించి అమ్ముకునే సమయంలో వర్షాలు, మరోవైపు పంటకు సరైన మద్దతు ధర లేకపోవటం. ఇలా ప్రతిసారి ఎదురుదెబ్బలు తగిలి ఆత్మహత్యకు పాల్పడుతున్న రైతన్నలు ఎందరో. గత మూడేళ్లుగా నష్టానికి పరిహారం వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న రైతులకు..ఆ డబ్బులు వేరే వారి ఖాతాలో పడటంతో అయోమయంలో పడ్డారు. తమకు న్యాయం చేయాలని పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలోని చిట్టవరం రైతులు వేడుకుంటున్నారు.
ఖరీఫ్‌లో కురిసిన అధిక వర్షాలకు వందలాది ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం రైతులకు అందించేందుకు వ్యవసాయ రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించి నష్టం అంచనా వేశారు. అర్హులైన రైతులకు పరిహారం అందకుండా.. అనర్హులకు లబ్ధి చేకూరింది. దీంతో అన్నదాతలు ఆందోళన చేపట్టారు. ఘటనపై రైతులు అధికారులకు వినతులు అందజేశారు. వీఆర్ఏ పోలిశెట్టి నరేంద్రనే దీనికి కారణమని భావిస్తున్న రైతులు.. చర్యలు చేపట్టాలని కోరారు. ఈ అంశాలపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఇవ చదవండి