ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తమ భూములను తీసుకోవద్దని పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలం సింగవరంలో రైతులు ఆందోళన చేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినందున కొత్తగూడెం పంచాయతీ పరిధిలో దాదాపు 180 మందిని అర్హులుగా గుర్తించారు. ఇందులో భాగంగా సింగవరంలో ఇళ్లస్థలాల కోసం రైతులు సాగు చేస్తున్న భూమిని ఇవ్వడానికి అధికారులు చర్యలు చేపట్టారు. విషయం తెలుసుకున్న రైతులు అధికారులను అడ్డుకోవటమే కాక కుటుంబ సభ్యులతో కలిసి పొలాల్లో టెంట్లు వేసుకొని నిరసనకు దిగారు. భూములే తమకు ఆధారమని, వీటిని ఇళ్ల స్థలాల కోసం ఇస్తే తమకు ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని అన్నదాతలు కోరుతున్నారు.
పొలాల్లో టెంట్లు వేసుకొని అన్నదాతల నిరసన
ఇళ్ల స్థలాల పంపిణీ కోసం తమ భూములను తీసుకోవడం అన్యాయమని దెందులూరు మండలం సింగవరంలో రైతులు నిరసన చేపట్టారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు.
దెందులూరులో రైతన్నల ఆందోళన