పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అధిక ఆశ్వయుజ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రెండో రోజు ఆదివారం వేద పండితులు, అర్చకులు ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి వాహనమైన గరుడి చిత్రాన్ని పతాకంపై ముద్రించారు. ధ్వజస్తంభం మీద ముహూర్త సమయంలో గరుడ పటాన్ని ఎగరవేశారు. ధ్వజారోహణ జరిపి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు సర్వ దేవతలకు ఆహ్వానం పలికారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఈ వేడుకలను ఘనంగా జరిపించారు.
ద్వారకా తిరుమలలో వైభవంగా ధ్వజారోహణ - ద్వారకా తిరుమలలో తిరు కల్యాణ ఉత్సవం
పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి అధిక ఆశ్వయుజ మాస తిరు కల్యాణ మహోత్సవాలు ఏకాంతంగా నిరాడంబరంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో రెండో రోజు ఆదివారం రాత్రి ధ్వజారోహణ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ద్వారకా తిరుమలలో వైభవంగా ధ్వజారోహణ
ఈ కార్యక్రమానికి ముందు మంగళ వాయిద్యాలతో అర్చకులు పుట్టమన్ను తెచ్చారు. పాలికల్లో ఈ పుట్టమన్ను ఉంచి నవధాన్యాలను పోసి అంకురార్పణ జరిపారు.
ఇదీ చదవండి: ఉరకలేస్తున్న కృష్ణమ్మ.. పరీవాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తం