పశ్చిమగోదావరి జిల్లా తణుకు పాత ఊరికి చెందిన నాగ మురళీకృష్ణను పోలీసులు అరెస్టు చేశారు. తణుకు పట్టణం, తణుకు మండల గ్రామాలు, ఉండ్రాజవరం మండలం గ్రామాల్లో నిందితుడు 7 చోట్ల చోరీలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. అతని నుంచి 124 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. తాళం వేసిన గృహాలలో, వేకువజామున ఇంటి బయట ఉన్న మహిళల నుంచి బంగారు వస్తువులను అపహరించాడని డీఎస్పీ రాజేశ్వర్ రెడ్డి వెల్లడించారు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు.
వరుస చోరీల కిలాడి అరెస్టు - పశ్చిమగోదావరి జిల్లా
తణుకులో వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 124 గ్రాముల బంగారు వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు.
అరెస్టు