పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో జాల అబ్రహం ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు కూరగాయలు పంపిణీ చేశారు. రోజుకు 200 కుటుంబాల చొప్పున పంపిణీ చేస్తామని ట్రస్ట్ వ్యవస్థాపకుడు జాల రవికుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ఏలూరు రూరల్ సీఐ శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నిబంధనల ప్రకారం అధికారుల అనుమతులు తీసుకుని కూరగాయలు పంపిణీ చేయడం అభినందనీయమని సీఐ ప్రశంసించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, అనవసరంగా రోడ్లపైకి రాకూడదని సూచించారు.
పేదలకు కూరగాయలు పంపిణీ
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవడం ద్వారా రహదారులు నిర్మానుష్యంగా మారాయి. ఫలితంగా ఉపాధి కోల్పోయిన పేదలు, కూలీలు, వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన కొందరు తమ వంతు సహాయం చేస్తున్నారు. తమకు తోచినంత తోడ్పాటును అందిస్తూ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
పేదలకు కూరగాయలు పంపిణీ