మతోన్మాద శక్తుల దాడులకు వ్యతిరేకంగా మతసామరస్యం కోరుతూ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీపీఐ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. గాంధీ అన్ని మతాల వారు సమానమేనని...అందరూ కలిసి జీవించాలని ఆకాంక్షించారని నాయకులు పేర్కొన్నారు. దురదృష్టవశాత్తు నేడు మతసామరస్యం మంట కలుపుతూ...మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా బాధ్యత తీసుకుని రాజ్యాంగంలో పేర్కొన్న లౌకిక వాద పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మతసామరస్యం కోరుతూ తణుకులో సీపీఐ నిరసన
మతోన్మాద శక్తుల దాడులకు వ్యతిరేకంగా మతసామరస్యం కోరుతూ సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా తణుకులో గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టింది. గాంధీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తణుకులో మతసామరస్యం కోరుతూ సీపీఐ నిరసన