పశ్చిమ గోదావరి జిల్లాలో పటిష్టంగా లాక్డౌన్ అమలు - lock down in west godavari
పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజలెవ్వరూ రహదారులపైకి రాకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 10 గంటల తరువాత మందుల దుకాణాలు మినిహా మిగిలిన అన్ని దుకాణాలు మూతపడ్డాయి. ప్రధాన పట్టణ రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. జనసంచారం లేక రహదారులన్నీ నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి.
పశ్చిమ గోదావరి జిల్లాలో పటిష్టంగా లాక్డౌన్ అమలు
By
Published : Apr 13, 2020, 7:21 PM IST
పశ్చిమ గోదావరి జిల్లాలో లాక్డౌన్ను పోలీసులు పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 23 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తాడేపల్లిగూడెంలో కరోనా పాజిటివ్ కేసు నిర్థరణ అయిన వ్యక్తి వద్ద డ్రైవర్గా పని చేసిన వ్యక్తికి కరోనా సోకటంతో జిల్లా అధికారులు మరింత అప్రమత్తయ్యారు.
ప్రాంతం
పాజిటివ్ కేసుల సంఖ్య
ఏలూరు
9
పెనుకొండ
5
భీమవరం
2
తాడేపల్లిగూడెం
2
ఉండి
2
ఆకివీడు
1
నరసాపురం
1
గుండుగొలను
1
మెుత్తం
23
జిల్లాలో ఇప్పటికే 12 ప్రాంతాలను రెడ్జోన్లుగా గుర్తించారు. జిల్లా ఆసుపత్రితో పాటు, ఆశ్రమ ఆసుపత్రిని కొవిడ్ ఆసుపత్రులుగా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో 210 ఐసోలేషన్ వార్డులను అందుబాటులో ఉంచారు. 5 వేల క్వారంటైన్ పడకలు ఏర్పాటు చేయగా, వీటిల్లో 650 మంది ఉంటున్నారు. రెడ్జోన్ల పరిధిలోని 25 వేల కుటుంబాలను స్వీయ గృహనిర్బంధంలో ఉంచారు. ఉదయం 10 గంటల నుంచి ప్రజలెవ్వరూ రహదారులపైకి రాకుండా పోలీసులు గస్తీ కాస్తున్నారు. మందులు దుకాణాలు మినహా మిగిలిన అన్ని దుకాణాలు మూతపడ్డాయి. జిల్లాలో ప్రధాన పట్టణాలైన ఏలూరు, భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేశారు.