ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అర్ధరాత్రి అడవిలో కరోనా బాధితులు.. పక్కనే శవం.. - పశ్చిమగోదావరిలో కరోనా

కరోనా బాధితులు ఎక్కడ ఉండాలి.. ఐసోలేషన్​లో జాగ్రత్తలు తీసుకుంటూ.. ఉండాలి. వారిని వేరే ప్రదేశానికి తీసుకెళ్లితే ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి. కానీ కొంతమంది కొవిడ్ బాధితులు అడవిలో.. అర్ధరాత్రి 12 గంటల వరకూ ఉన్నారు. కరోనాతో అప్పటికే గుండెల్లో గుబులుతో ఉన్న వాళ్ల పక్కనే ఓ శవం కూడా ఉంది. అప్పుడు వాళ్ల పరిస్థితేంటి?

అర్ధరాత్రి అడవిలో కరోనా బాధితులు.. పక్కనే శవం..
అర్ధరాత్రి అడవిలో కరోనా బాధితులు.. పక్కనే శవం..

By

Published : Jul 22, 2020, 8:10 AM IST

Updated : Jul 22, 2020, 4:09 PM IST

పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి మండలంలో కరోనా వైరస్ విజృంభిస్తుంది. గడిచిన 24 గంటల్లో 26 మందికి పైగా కరోనా పాజిటివ్​గా అధికారులు నిర్ధరణ చేశారు. వారిలో 14 మందిని ఏలూరుకు తరలిస్తుండగా లింగపాలెం అటవీ ప్రాంతానికి వెళ్లే సరికి ఓ వృద్ధుడు గుండె పోటుతో మృతి చెందారు. దీంతో బస్సును పక్కకు పెట్టి రోగులను రాత్రి 12 గంటల వరకు అక్కడే ఉంచారు. తాగటానికి నీరు కూడా లేదని... మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని గంటల పాటు ఇక్కడే ఉన్నామంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

పాజిటివ్ వచ్చిన వారిని అంబులెన్స్​లో కాకుండా ప్రైవేటు వాహనంలో తరలించడం వల్ల వృద్ధుడు మృతి చెందారని వారు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కరోనా పాజిటివ్ వచ్చిన వారిని తరలిస్తున్న వాహనంలో వైద్య సిబ్బంది ఎవరూ లేకపోవడం గమనార్హం. రాత్రి 12 సమయంలో అధికారులు అక్కడికి చేరుకుని వారిని ఏలూరు తరలించారు. వృద్ధుడి మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో ఖననం చేశారు.

అర్ధరాత్రి అడవిలో కరోనా బాధితులు.. పక్కనే శవం..
Last Updated : Jul 22, 2020, 4:09 PM IST

ABOUT THE AUTHOR

...view details