ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: నూతన ఖైదీలకు కొత్త జైళ్లు

రాష్ట్రంలో కరోనా కోరలు చాస్తోంది. వైరస్ ప్రభావం జైళ్లపైనా పడింది. ఈ నేపథ్యంలో ఖైదీలను వైరస్ నుంచి రక్షించడానికి జైళ్ల శాఖ చర్యలు ప్రారంభించింది. నూతనంగా జైళ్లకు వస్తున్నవారితోనే కరోనా వ్యాప్తి చెందుతుందని గుర్తించిన అధికారులు... వారి కోసం ప్రత్యేక కారాగారాలు సిద్ధం చేశారు. ఆ ఏర్పాట్లపై జైళ్ల శాఖ ఐజీ జయవర్ధన్ 'ఈటీవీ భారత్'​తో ప్రత్యేకంగా మాట్లాడారు.

Corona effect: new prisons for new inmates
నూతన ఖైదీలకు కొత్త జైళ్లు

By

Published : Jul 30, 2020, 9:18 PM IST

ప్రశ్న: కొవిడ్ నేపథ్యంలో జైళ్లలో ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు..?

జవాబు: జైళ్లలో కొవిడ్ నివారణకు ప్రభుత్వం ఇటీవలే పలు మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం... రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో కొత్తగా వచ్చేవారి కోసం ప్రత్యేక కారాగారాలు సిద్ధం చేశాం. నూతన ఖైదీలకు పరీక్షలు నిర్వహించి... పాజిటివ్ నిర్ధారణ అయితే ఐసోలేషన్ కేంద్రానికి తరలిస్తున్నాం. నెగెటివ్ వచ్చిన వారిని సాధారణ జైళ్లకు తరలిస్తున్నాం.

ప్రశ్న: ప్రస్తుతం ఏర్పాటు చేసిన కొత్త జైళ్ల కెపాసిటి ఎంత..? వాటిల్లో ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి..?

జవాబు: ఈ ఒక్కో జైళ్లో సుమారు 50 మంది వరకు ఉంచొచ్చు. ఒక్కొదాంట్లో 4-5 బ్యారక్​లు ఉంటాయి. వీటిల్లో నూతనంగా వచ్చిన వారిని ఉంచుతున్నాం. ఇక్కడికి వచ్చాక పాజిటివ్ వస్తే ఐసోలేషన్ సెంటర్​కు, రాకుంటే సాధారణ జైలుకు పంపుతున్నాం.

ప్రశ్న: సాధారణ జైళ్లలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..?

జవాబు: ఖైదీలందరికీ ఒక్కొక్కరికి 3 మాస్కుల చొప్పున ఇచ్చాం. శానిటైజర్లు పంపిణీ చేశాం. చేతులు శుభ్రంగా కడుక్కునేలా అవహగాన కల్పిస్తున్నాం. సిబ్బంది లోపలికి దగ్గం డిస్​ఇన్ఫెక్షన్ టన్నెల్స్ ఏర్పాటు చేశాం. వారోనికోసారి జైలు ఆవరణ మొత్తాన్ని శుభ్రం చేయిస్తున్నాం.

ప్రశ్న: జైళ్లో ఉన్న ఖైదీలను కోర్టులకు, ఇతర కారణాలతో బయటకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు..?

జవాబు:కొవిడ్ కారణంగా ఖైదీలను ఎవ్వరితో కలవనీయడంలేదు. కోర్టులకు కూడా తీసుకెళ్లడం లేదు. కేవలం వైద్యం కోసం ఆసుపత్రికి మాత్రమే తీసుకెళ్తున్నాం. వేరే ఏ ఇతర కారణాలతో బయటకు తీసుకెళ్లడం లేదు.

ఇదీ చదవండి...

తగ్గని కరోనా ఉద్ధృతి.. 24 గంటల్లో 10,167 కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details