పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో 8 సంవత్సరాల బాలుడికి కరోనా పాజిటివ్‌గా నిర్థరణ కాగా... కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో... హైదరాబాద్ నుంచి వచ్చిన మహిళకు కరోనా సోకింది. వీరిద్దరిని అధికారులు ఏలూరు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు. పోలవరం టి.నరసాపురం మండలంలో సైతం కరోనా కేసులు నమోదయ్యాయి. ఆయా ప్రాంతాల్లో పంచాయతీ అధికారులు సూపర్ శానిటేషన్ పనులను చేపడుతూ... అనుమానితలను గుర్తించి పరీక్షలు చేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో విజృంభిస్తున్న కరోనా - పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో 8 సంవత్సరాల బాలుడికి..., కొయ్యలగూడెం మండలం నరసన్నపాలెంలో ఓ మహిళకు కరోనా నిర్థరణ అయినట్లు అధికారులు తెలిపారు.
జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెంలో విజృంభిస్తున్న కరోనా