మొక్కజొన్న రైతులపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్ర ప్రభావం చూపుతోంది. కోళ్ల పరిశ్రమ కుదేలవటం, కొనుగోలుదారులు లేకపోవటంతో ధరలు అమాంతం పడిపోయాయి. దీనివల్ల మొక్కజొన్న రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ముఖ్యంగా పశ్చిమగోదావరి జిల్లాలోని రైతులపై ఈ ప్రభావం ఎక్కువ కనబడుతోంది. రబీ సీజన్ కింద రెండో పంటగా ఇక్కడ అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న సాగుచేశారు. జిల్లావ్యాప్తంగా లక్షా 50 వేల ఎకరాల వీస్తీర్ణంలో ఈ పంటను సాగుచేశారని అంచనా. మూడేళ్లుగా కత్తెర పురుగు, ధరలు లేకపోవటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మొక్కజొన్న పంటకు 'కరోనా' చీడ..! - పశ్చిమగోదావరి జిల్లా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలో మొక్కజొన్న రైతులను కరోనా కలవరపెడుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో పంటకు గిట్టుబాటు ధర రాక చెమటోడ్చి పండించిన మొక్కజొన్నను కొంతమంది రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు.
ఈ ఏడాది కత్తెర పురుగును నివారించినప్పటికీ రైతులపై కరోనా పిడుగు పడింది. మొక్కజొన్నను కోళ్లకు దాణాగా అందిస్తారు. ఈ మహమ్మారి వైరస్ కారణంగా ఫౌల్ట్రీ రంగం కుదేలవటంతో మొక్కజొన్నకు గిరాకీ తగ్గింది. దీనికి తోడు తాజాగా లాక్డౌన్ విధించటంతో కొనుగోలుదారులు ముందుకు రావటం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొక్కజొన్న పంటను పలువురు రైతులు పొలాల్లోనే వదిలేస్తున్నారు. వచ్చే ఆదాయం పంట నూర్పిడి ఖర్చులకు సైతం సరిపోక పంటను నేలపాలు చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఇదీ చదవండి:కరోనాను జయించిన నర్సు.. మళ్లీ సేవలందించేందుకు సిద్ధం