అమరావతిని రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు చేపట్టిన ప్రజాచైతన్య యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకు చేరింది. ఏలూరు ఆశ్రం ఆసుపత్రి వద్ద చంద్రబాబు జోలె పట్టి విరాళాలు సేకరించారు. తెదేపా నేత ఆలూరు నాగేశ్వరరావు రూ.50 వేలు రైతులకు మద్దతుగా అందజేశారు.
ఏలూరులో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర
తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ప్రజాచైతన్య యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకుంది. పెద్ద ఎత్తున రైతులు, మహిళలు యాత్రలో అమరావతికి మద్దతుగా పాల్గొన్నారు.
ఏలూరులో చంద్రబాబు ప్రజాచైతన్య యాత్ర
పోలీసుల తీరుపై చింతమనేని నిరసన
ఏలూరు నుంచి తాడేపల్లిగూడెంకు బయలుదేరుతున్న చంద్రబాబు కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవటంతో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసుల తీరుకు నిరసనగా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రోడ్డుపై బైఠాయించారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చింతమనేనికి సర్ది చెప్పటంతో ఆందళన విరమించారు.
ఇదీ చదవండి: నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజా చైతన్య యాత్ర