పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఆర్యవైశ్య సేవా సంఘం, గౌడ సంఘం ఆధ్వర్యంలో చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా వేలమంది దాహార్తిని తీరుస్తున్నారు. ఆర్యవైశ్య సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ద్వారా రోజూ 5 వేల మందికి మజ్జిగ సరఫరా చేస్తుండగా... గౌడ సేవా సంఘం ఆధ్వర్యంలో సుమారు 4 వేల మందికి మంచినీరు, ఇతర పధార్థాలు పంపిణీ చేస్తున్నారు. సంస్థలు చేస్తున్న సేవల పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల దాహం తీరుస్తున్న చలివేంద్రాలు - ngo
వేసవిలో పెరుగుతున్న ఎండల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించడానికి సేవా సంస్థలు ముందుకొచ్చాయి. పలు సంస్థలు ఏర్పాటు చేసిన చలివేంద్రాలు వేలమంది ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి.
దాహం తీరుస్తున్న సేవాసంస్థల చలివేంద్రాలు