రాష్ట్రంలో సెల్ఫోన్ల చోరీలకు పాల్పడుతున్న నలుగురు సభ్యుల ముఠాను... పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. ఆకివీడు కూడలి వద్ద తనిఖీలు చేస్తుండగా... వాహనంలో అనుమానాస్పదంగా కనిపించిన వీరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ.10 లక్షల విలువైన 48 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, తిరుపతి రైల్వేస్టేషన్, బస్స్టేషన్లలో సెల్ఫోన్లు అపహరించి... ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రాల్లో అమ్ముతుంటారని విచారణలో వెల్లడైంది. నిందితుల్లో ఒకరు మైనర్ కాగా, ముగ్గురిని రిమాండ్‌కు తరలిస్తామని, మైనర్‌ను జువైనల్‌హోంకు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
సెల్‌ఫోన్ దొంగలను పటుకున్న భీమవరం పోలీసులు
రాష్ట్రంలో సెల్ఫోన్లు అపహరిస్తున్న ముఠాను... పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 48 చరవాణులు స్వాధీనం చేసుకున్నారు.
సెల్‌ఫోన్ దొంగలను పటుకున్న భీమవరం పోలీసులు