పశ్చిమగోదావరి జిల్లా మన్యం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి సరిహద్దులో కారు వాగులో పడింది. పందిరిమామిడిగూడెం గ్రామానికి చెందిన వ్యాపారి కంచర్ల రాము గల్లంతయ్యారు. కారులో ఉన్న మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. జల్లేరు, బైనేరు వెదుళ్లవాగు, ఇసుక, పెద్రాల వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
వాగులో పడ్డ కారు.. వ్యక్తి గల్లంతు - news on rains at west godavari
పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం, జీలుగుమిల్లి సరిహద్దులో కారు వాగులో పడింది. ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. కారులో ఉన్న మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు.
వాగులో పడ్డ కారు.. వ్యక్తి గల్లంతు