దేశంలో అన్ని వర్గాల ప్రజల ఆర్థిక వెసులుబాటును దృష్టిలో ఉంచుకుని కేంద్రం రూ.20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించిందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైడికొండల మాణిక్యాలరావు అన్నారు. తణుకులో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో ఆక్వా రంగ అభివృద్ధికి కేంద్రం రూ.20 వేల కోట్లు కేటాయించిందన్నారు. ఈ మొత్తాన్ని సద్వినియోగం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆక్వా రంగం ఎక్కువగా విస్తరించి ఉందన్న ఆయన.. అందుకనుగుణంగా ఉప్పాడ, నిజాంపట్నం, మచిలీపట్నంలో రేవులు అభివృద్ధి చేయడంతోపాటు, నర్సాపురంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆక్వా రంగానికి సంబంధించి బ్రూడర్స్ కొరత ఎక్కువగా ఉంది. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యలను అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వ నిధులను వినియోగించుకోవాలి. - పైడికొండల మాణిక్యాలరావు, భాజపా నేత