పశ్చిమగోదావరి జిల్లా చిన్న వెంకన్న కొలువైన ద్వారకా తిరుమల భక్తులతో కిటకిటలాడింది. స్వామివారికి ప్రీతిపాత్రమైన శనివారం కావటంతో భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నుంచే స్వామివారి దర్శనం లైన్లు, ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు బారులు తీరారు. శ్రీవారి కాంప్లెక్స్ లోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. సామాన్య భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి సుమారు 3గంటల సమయం పట్టింది. దర్శనం కోసం వేచి ఉన్న భక్తుల కోసం దేవస్థానం అధికారులు అల్పాహారాన్ని, మంచినీటి సదుపాయాన్ని కల్పించారు. చిన్న పిల్లలకు స్వామివారి క్షీర ప్రసాదాన్ని అందజేశారు. వృద్ధులకు, చంటి బిడ్డ తల్లులకు, దివ్యాంగులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు చేశారు.
భక్త జన సంద్రంగా ద్వారకా తిరుమల
పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకాతిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్ర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి.
ద్వారకా తిరుమల