పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో బీసీ ఐక్య వేదిక కార్యాచరణ కార్యక్రమంలో బీసీ ప్రజా జాతీయ అధ్యక్షులు గూడూరి వెంకటేశ్వరరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రాష్ట్రంలో ఐదు కోట్ల జనాభాలో మూడు కోట్ల వరకు బీసీలు ఉన్నారన్నారు. ప్రస్తుతం జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రకారం బీసీలకు అన్యాయం జరిగిందని అన్నారు. రాజకీయపరంగా బీసీలు ఎదుగుతున్నారన్న కక్షతో కొంతమంది కావాలని బురద జల్లుతున్నారని అటువంటి వాటిని తిప్పికొడతామని చెప్పారు.
'బీసీ రిజర్వేషన్లపై కుట్రలు తిప్పికొడతాం' - latest west godavari district news
జంగారెడ్డి గూడంలో బీసీ సమాఖ్య ఐక్య వేదిక సమావేశమైంది. తమపై జరుగుతున్న కుట్రలు తిప్పికొడతామంది.
జంగారెడ్డిగూడెంలో బీసీ ఐక్య వేదిక కార్యాచరణ సమావేశం