స్వయం సహాయక సంఘాలలోని సభ్యులు తయారుచేసే పలు రకాల ఉత్పత్తులను నారీ అనే బ్రాండ్ పేరిట అమ్మకాలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రవీణ వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణంలోని వాసవి కన్యకా పరమేశ్వరి సత్రంలో నారీ బ్రాండ్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెప్మా ఆధ్వర్యంలో మహిళలు తయారుచేసే వస్తువులకు బ్రాండ్ ఇమేజ్ ఇవ్వడం ద్వారా అధిక ఆదాయాన్ని పొందవచ్చని ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రవీణ అన్నారు. బ్రాండ్ ఇమేజ్ ఉంటే మహిళలు తయారు చేసే తినుబండారాలు, బట్టలు, బ్యాగులను బయట దుకాణాల్లో అమ్మడమే కాకుండా.. ఆన్లైన్లో కూడా అమ్మే అవకాశం ఉందన్నారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే తమ లక్ష్యమన్నారు. జిల్లాలో ఉన్న 9 పురపాలక సంఘాల నుంచి సుమారు 200 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈస్ట్ ఎఫ్ ఎక్స్ ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎస్‌హెచ్‌జి సభ్యులకు బ్రాండ్ గురించి వివరించారు.
'నారీ బ్రాండ్'పై అవగాహన సదస్సు - mepma
మహిళలకు అండగా మెప్మా బజారు ఎలా నిలిచిందో అదే మాదిరిగా నారీ కూడా ఉపయోగపడుతుందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ పి.ప్రవీణ వెల్లడించారు.
నారీ బ్రాండ్ పై అవగాహన సదస్సు...