పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భాగోపురంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ముగ్గురు గాయపడ్డారు. వీధిలో చలిమంటలు వేసుకొని అల్లరి చేస్తున్నారని ఓ వర్గం వారు.. మరో వర్గంతో వివాదానికి దిగారు. వివాదం కాస్త ముదిరి కర్రలు, కత్తులతో దాడి చేసుకున్నారు. పరస్పర దాడిలో కోటేశ్వరరావు, రంగారావు, రామకృష్ణ అనే వ్యక్తులు గాయపడగా... వారిని ఏలూరు ఆసుపత్రికి తరలించారు. రామకృష్ణ అనే వ్యక్తి పరిస్థతి విషమించడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చలిమంట వివాదం..ఇరు వర్గాలు కర్రలు, కత్తులతో దాడి - west godavari district news
చలిమంట విషయంలో ఇరు వర్గాల మధ్య దాడి జరిగిన ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది. ఈ వివాదంలో ముగ్గురికి గాయాలు కాగా... వారిలో ఒకరి పరిస్థతి విషమంగా ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చలిమంట వివాదం