భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ లో చేరి దేశానికి సేవా చేయాలని ఉందంటున్నారు...ఇరు రాష్ట్రాల ఎంసెట్ పరీక్షల్లో మొదటి ర్యాంకు సాధించిన కురిశెట్టి రవిశ్రీతేజ. ప్రణాళిక ప్రకారం చదవటం వల్లే ర్యాంకు సాధించగలిగానని చెప్తున్నాడు... ఈ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన తాడేపల్లిగూడెం చిన్నోడు. విజయవాడలో ఓప్రైవేటు కళాశాలలో ఇంటర్ చదివిన రవిశ్రీతేజ....ఐఐటీలో బీటెక్ చేయాలనేది తన లక్ష్యమంటున్నారు. వేగం, కచ్చితత్వం కోసం తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఎంసెట్ పరీక్ష రాశానన్నారు. బిట్ శాట్ లో కూడా మంచి మార్కులు వచ్చాయని రవితేజ ఆనందం వ్యక్తం చేశారు. రవిశ్రీతేజ పోటీ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించినందుకు కుటుంబసభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సివిల్ సర్వీస్‌లో చేరి దేశానికి సేవ చేయాలని ఉంది - civil services
ఒక ప్రణాళిక ప్రకారం చదవటం వల్లనే.. ఏపీ, తెలంగాణ మొదటి ర్యాంకు సాధించానని రవిశ్రీతేజ తెలిపారు.
రవిశ్రీతేజ
Last Updated : Jun 11, 2019, 12:45 AM IST