ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి - పశ్చిమగోదావరి తాజా వార్తలు

విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందారు. ఇనుప కర్రను మోసుకు వెళ్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదానికి గురయ్యాడు .

man was electrocuted
విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి

By

Published : Oct 29, 2020, 3:04 PM IST

పశ్చిమ గోదావరి జిల్లా జీలుగుమిల్లి మండలం రాజన్న గూడెంలో విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం రామన్నగూడెం కు చెందిన నక్క నారాయణ... రెండేళ్లుగా రాజన్న గూడెం , ఆర్ అండ్ ఆర్ కాలనీ లో భవన నిర్మాణ కార్మికునిగా పనిచేస్తున్నారు. ఎప్పటిలాగే ఉదయం పనికి వెళ్లిన అతడు ఇనుప కర్రను మోసుకు వెళ్తుండగా పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదానికి గురయ్యాడు .

విద్యుదాఘాతం తీవ్రంగా కొట్టడంతో అతను అక్కడే మృతి చెందాడు . మృతునికి భార్య భూలక్ష్మి ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు. ఎస్సై విశ్వనాథ బాబు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు . మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జంగారెడ్డిగూడెం క్రాంతి ఆసుపత్రికి తరలించారు.

కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .

ఇదీ చదవండీ...మంత్రికి తలనొప్పిగా మారిన వర్గ విభేదాలు

ABOUT THE AUTHOR

...view details