పశ్చిమగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు వద్ద గల గోదావరి నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన నలుగురు యువకులు గోదావరి తీరానికి వినోదం కోసం వచ్చారు. కాకరపర్రు వద్ద గోదావరి ఒడ్డున విహరించిన వారు... గోదావరికి అవతలి వైపునకు వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో ముగ్గురు యువకులు నదిలో మునిగిపోయారు.నవీన్‌కుమార్ అనే యువకుడు మాత్రం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గల్లంతైనవారిలో ముత్యాల మణికుమార్, సాయికిరణ్, వంశీ ఉన్నారు.
గోదావరి విహారంలో అపశ్రుతి... ముగ్గురు యువకులు గల్లంతు - godavari
విహారయాత్ర విషాదంగా ముగిసింది. పెరవలి మండలం కాకరపర్రు వద్ద నలుగురు యువకులు గోదావరిలో ఈతకు వెళ్లగా.. ముగ్గురు గల్లంతయ్యారు.
ముగ్గురు యువకులు గల్లంతు
గోదావరి అవతలి ఒడ్డుకెళ్లి, తిరిగి వస్తుండగా తన స్నేహితులు ముగ్గురు మునిగిపోయినట్టు ప్రమాదం నుంచి బయట పడిన నవీన్‌కుమార్ తెలిపారు. రాత్రి కావటంతోగల్లంతైనవారి కోసం ఉదయాన్నే గాలింపుచర్యలు చేపట్టనున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇవీ చూడండి :తప్పు వైకాపాది.. ఫిర్యాదు తెదేపాపైనా...?: చంద్రబాబు