పశ్చిమగోదావరి జిల్లాలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా గురువారం 15 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం వాటితో కలిపి జిల్లాలో కేసుల సంఖ్య 173కి చేరుకుంది. తాజాగా నమోదైన 15 కేసుల్లో ఏలూరులో 12, పెదపాడులో 2, దెందులూరు 1 ఉన్నాయి.
జిల్లాలో తాజాగా 15 పాజిటివ్ కేసులు నమోదు - పశ్చిమగోదావరి జిల్లా కొవిడ్ 19 తాజా వార్తలు
పశ్చిమగోదావరి జిల్లాలో తాజాగా 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 173కు చేరుకుంది. 58 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా... 115 మంది కొవిడ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
జిల్లా కేంద్రమైన ఏలూరు పరిసర ప్రాంతాల్లో కరోనా విజృంభిస్తోంది. నమోదవుతున్న కేసుల్లో 58 ఏలూరు పరిధిలోనే ఉన్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు 33,246 పరీక్షలు నిర్వహించగా... 29, 945 నెగిటివ్ ఫలితాలు వచ్చాయి. మిగిలిన 3128 పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొత్తగా ఆరు కంటైన్మెంట్ క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకూ జిల్లాలో 58 మంది వ్యాధి నుంచి కోలుకుని డిశ్ఛార్జి అయ్యారు. ప్రస్తుతం 115 మంది ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.