ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'కరోనా వ్యాప్తి నియంత్రణకు మరిన్ని చర్యలు తీసుకోవాలి' - విజయనగరంలో కరోనా కేసులు న్యూస్

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో క‌రోనా వ్యాధి నియంత్ర‌ణ‌కు మ‌రిన్ని చ‌ర్య‌లను తీసుకోవాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డాక్ట‌ర్ మ‌హేష్‌కుమార్ ర‌విరాల ఆదేశించారు. వైద్యారోగ్య‌శాఖ అధికారులు, ఆసుప‌త్రుల నోడల్ ఆఫీస‌ర్ల‌తో క‌లెక్ట‌రేట్ ఆడిటోరియంలో స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు.

vizianagaram joint collector on covid
vizianagaram joint collector on covid

By

Published : Aug 12, 2020, 11:37 PM IST

క‌రోనా వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్టేందుకు మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేయాల‌ని జాయింట్ కలెక్టర్ మహేష్ కుమార్ కోరారు. క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌వారి డైరెక్ట్ కాంటాక్ట్స్‌ను త్వ‌ర‌గా గుర్తించి ప‌రీక్షించడం ద్వారా, వ్యాధి వ్యాప్తిని అరిక‌ట్ట‌వ‌చ్చ‌ని సూచించారు. మ‌ర‌ణాల శాతాన్ని ఇంకా త‌గ్గించాల‌న్నారు. ప్ర‌తీ కొవిడ్ ఆసుపత్రిలో 24గంట‌ల హెల్ప్​ డెస్క్​లో సిబ్బందిని అందుబాటులో ఉంచాలని స్పష్టం చేశారు.

రోగికి ఏ స‌మ‌యంలో ఏ విధ‌మైన వైద్యం, ఇత‌ర స‌హాయం అవ‌స‌ర‌మున్నా, దానిని అందించేందుకు హెల్ప్ డెస్కు బాధ్య‌త తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. క‌రోనా రోగుల వివ‌రాల‌ను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసే విష‌యంలో జాప్యం జ‌రుగుతోంద‌ని, దీనిని నివారించేందుకు ప్ర‌తీ ఆసుప‌త్రికి న‌లుగురు ఆరోగ్య‌మిత్ర‌ల‌ను నియ‌మించాల‌ని సూచించారు. కొవిడ్ ఆసుప‌త్రుల్లోని అన్ని ప‌డ‌క‌ల‌ను పూర్తిగా నింపేయ‌కుండా, అత్య‌వ‌స‌ర రోగుల‌కోసం క‌నీసం 10శాతం బెడ్స్‌ను కేటాయించాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details