ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పార్వతీపురం ఐటీడీఏలో ఉగాది సంబరాలు

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, పార్వతీపురం ఐటీడీఏ అధికారులు తెలుగు సంవత్సరాది వేడుకలను నిర్వహించారు. ఉన్నతాధికారుల సతీమణులు తెలుగులో విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

పార్వతీపురం ఐటీడీఏలో ఉగాది సంబరాలు

By

Published : Apr 4, 2019, 8:29 PM IST

పార్వతీపురం ఐటీడీఏలో ఉగాది సంబరాలు
విజయనగరం జిల్లా పార్వతీపురంలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు తెలుగు సంవత్సరాదికి ముందస్తు సంబరాలు చేశారు. ఈ వేడుకలకు ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్ లక్ష్మీ శ, ఉపకలెక్టర్ చేతన్, ఏఎస్పీ గరుడ సతీమణులు హాజరయ్యారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారుల సతీమణులు... విద్యార్థులకు తెలుగులో ఉగాది శుభాకాంక్షలు చెప్పారు.

విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. స్వచ్ఛ భారత్​పై అవగాహన కల్పిస్తూ ఆడిన నాటకం ఆలోచింపజేసింది. వేడుక ప్రాంగణమంతా ఉగాది హడావుడిని సంతరించుకుంది. సభా ప్రాంగణాన్ని మామిడి తోరణాలతో అలంకరించారు. ముగ్గులు వేశారు.

ABOUT THE AUTHOR

...view details