ముందుగా ప్రతిపాదించిన 2700 ఎకరాల్లో కాకుండా 500 ఎకరాలను తగ్గించి ఎయిర్ పోర్ట్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించడం ఈ ప్రాంత రైతులను దగా చేయడమేనని విజయనగరం జిల్లా తెదేపా నేతలు విమర్శించారు. మిగిలిన భూములను విక్రయించి, వ్యాపారం చేసుకునేందుకు ప్రభుత్వం 500 ఎకరాలను తగ్గించదని ఆరోపించారు. ఎయిర్ పోర్ట్ నిర్మితమవుతున్న నెల్లిమర్ల నియోజకవర్గం తెదేపా నేతలు ప్రభుత్వ ప్రతిపాదనపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఎయిర్పోర్ట్ విస్తీర్ణం తగ్గించడం.. రైతులను మోసం చేయడమే - tdp leaders comments on bhogapuram airport
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో వైకాపా ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని విజయనగరం జిల్లా తెదేపా నేతలు ఆరోపించారు. విమానాశ్రయానికి సేకరించిన భూములు 500 ఎకరాలను ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం ఎంతవరకు సమంజసమని నేతలు నిలదీశారు.
ఎయిర్పోర్ట్ విస్తీర్ణం తగ్గించడంపై తెదేపా నేతలు
ఇవీ చూడండి...అప్పలరాజుకు 700ఎకరాలు ఉంది... ఆన్లైన్లో..!