భోగాపురంలో ఇద్దరిపై కత్తితో దాడి..మహిళ పరిస్థితి విషమం - భోగాపురంలో సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం
విజయనగరం జిల్లా భోగాపురంలో భూమి విషయంలో ఇరువర్గాలకు ఘర్షణ తలెత్తింది. ఈ వాగ్వాదంలో ఇద్దరి వ్యక్తులపై మరో వర్గం వ్యక్తులు కత్తితో దాడి చేయగా..మహిళ పరిస్థితి విషమంగా ఉంది.
విజయనగరం జిల్లా భోగాపురంలో ఇరు కుటుంబాలకు మధ్య గొడవకాగా.. ఇద్దరిని కత్తితో పొడిచారు మరో వర్గానికి చెందిన వ్యక్తులు. పూసపాటిరేగ మండలం కోనాడ గ్రామానికి చెందిన ఓ కుటుంబం... తమ బంధువులతో భోగాపురం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్దకు వెళ్లారు. అక్కడికి ఆ కుటుంబ సభ్యులకే సంబంధించిన కొంత మంది వ్యక్తులు రౌడీలతో కలిసి వెళ్లి ..వారితో గొడవపడ్డారు. ఎకరం 92 సెంట్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఆపాలని ఓ వర్గం వారు చెప్పగా... రిజిస్ట్రేషన్ ఆపేదిలేదని మరో వర్గంం తెలిపింది. ఈ వాగ్వాదంలో ఇద్దరు వ్యక్తులపై మరో వర్గానికి చెందిన వారు కత్తితో దాడులు చేశారు. కోనాడ గ్రామానికి చెందిన చిల్ల అరుణ సహా మరోవ్యక్తికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో మహిళ పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. బసవ ఉపేంద్ర , బసవ వెంకటేష్, అప్పల నర్సమ్మలను నిందితులుగా గుర్తించి పోలీసులు గాలిస్తున్నారు. పరారీలో ఉన్న నిందితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి భోగాపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి.బాల్య వివాహం చేసిన తల్లిదండ్రులు.. పోలీసులకు ఫిర్యాదు చేసిన చిన్నారి