ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్​గ్రేడ్ చేశారు సరే... తరగతి గదులేవి..?

అరొకర సౌకర్యాలతో మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఈ ఏడాదికి పాఠశాలను అప్​గ్రేడ్ చేసినా... తరగతి గదుల కొరతతో అది కార్యరూపం దాల్చలేదు. విద్యార్థులు చుట్టుపక్కల పాఠశాలలకు వెళ్లి విద్యనభ్యసించాల్సి వస్తుంది.

By

Published : Mar 1, 2020, 4:37 PM IST

అరకొర సౌకర్యాలు...విద్యార్థులకు వెతలు
అరకొర సౌకర్యాలు...విద్యార్థులకు వెతలు

అప్​గ్రేడ్ చేశారు సరే... తరగతి గదులేవి..?

విజయనగరం జిల్లా మామిడిపల్లి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు తిప్పలు తప్పటం లేదు. ప్రస్తుతం ఇక్కడ 8వ తరగతి వరకు ఉండగా... ఈ ఏడాది పాఠశాలను అప్​గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సరైన వసతి సౌకర్యాలు లేక 9వ తరగతిని ప్రారంభించలేదు. రెండు, మూడు తరగతులను కలపి ఒకే గదిలో పాఠాలు చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ 8వ తరగతి పూర్తి చేసుకున్న పిల్లలు కొత్తవలస, బొబ్బిలి పాఠశాలలకు వెళ్లి విద్యనభ్యసించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి నూతన భవనాలు నిర్మించాలని విద్యార్థులు కోరుతున్నారు. వచ్చే ఏడాదినాటికైనా సమస్యను పరిష్కరించి తమ చదువులు స్వగ్రామంలోనే కొనసాగేటట్లు చూడాలని వేడుకుంటున్నారు.

ABOUT THE AUTHOR

...view details